Telugu translation of The Flame of Attention
శ్రద్ధాగ్ని జ్వాల
కృష్ణమూర్తి శ్రద్ధ లేదా సావధానశీలత అనే మాటకు మార్మికమైన తొడుగు వేసి కప్పి పెట్టలేదు. మన నిత్యజీవితంలోని సాధారణమైన అనుభవాలలో శ్రద్ధకు లేదా సావధానతకు గల ప్రాధాన్యాన్ని సుస్పష్టంగా వివరించారు.
మన గురించి మనకో మనోచిత్రం ఉన్నప్పుడు, ఎవరైనా మనల్ని నీవు శుద్ధ మూర్ఖుడివి అని అన్నారనుకోండి. వెంటనే మనలో ఒక ప్రతిచర్య ఛర్రున పైకి లేస్తుంది. ఆ ఒక్క క్షణంలోనే ప్రతిచర్య జరుగుతుంది కాబట్టి ఆ తక్షణతకు మీ సావధానతను ఇవ్వండి. అంటే, నీవు వట్టి మూర్ఖుడివి అనే ఆ వాక్యాన్ని చాలా స్పష్టంగా ఆలకించండి. చాలా శ్రద్ధతో వినండి. సంపూర్ణమైన సావధానతతో కనుక వింటే, అప్పుడు ప్రతిచర్య ఏదీ వుండదు... అలసత్వంలో పడి వున్న మనసు, గందరగోళంతో నిండి వున్న మెదడు, అలజడి చెంది వికలమై, స్థిరత కోల్పోయిన మనసు, నిజ వాస్తవంలో దేనినీ ముఖాముఖంగా ఎదుర్కోలేని మనసు, తనలో గల అత్యున్నత శక్తి సామర్థ్యాన్ని తను వెలికి తెచ్చుకోలేని మనసు - అటువంటి సంపూర్ణ సావధానతను ఇవ్వగలుతుందా? నీవు వట్టి మూర్ఖుడివి అని ఎవరైనా మనతో అన్నప్పుడు మన సంపూర్ణ సావధానత ఆ వాక్యంపై వుంటే, అప్పుడా మాటలకు ఏమాత్రం ప్రాముఖ్యత, ప్రాధాన్యత వుండవు.
ఈ పుస్తకంలో వున్న ఇటువంటి అనేక వ్యాఖ్యలు పాఠకులకు సన్నిహితంగా తగిలి స్పందింప చేస్తాయి. తన మనసును తను అవగతం చేసుకోవాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ చదివి తీరవలసిన 9 ప్రసంగాల సంపుటి ఇది.
top of page
₹175.00 Regular Price
₹125.00Sale Price
OTHER RECCOMENDATIONS
bottom of page